HomeTelugu Reviews'జాంబీ రెడ్డి' రివ్యూ

‘జాంబీ రెడ్డి’ రివ్యూ

Zombie Reddy trailer

టాలీవుడ్‌లో బాలనటుడిగా మెగాస్టార్‌ ఇంద్రతో పాటు పలు సినిమాల్లో నటించాడు తేజ సజ్జ. ఆ తర్వాత సమంత మూవీ ‘ఓ బేబీ’లో కనిపించాడు. తాజాగా ‘జాంబీ రెడ్డి’ సినిమాతో తేజ సజ్జ హీరోగా వచ్చాడు. ‘అ’, ‘కల్కి’ డైరెక్టర్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ జాంబీలకు కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

కథ:
ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఇందులో హీరో తేజ సజ్జ ఓ గేమ్ డిజైనర్. లాక్‌డౌన్ సమయంలో తన గ్యాంగ్‌తో కలిసి స్నేహితుడి పెళ్లికి వెళ్తాడు. ఈ గ్యాంగ్‌కు ప్రయాణంలో అనుకోని సంఘటన ఎదురవుతుంది. పెళ్లికి వెళ్లాక వీళ్ల గ్యాంగ్‌లో ఒకడు జాంబీగా మారిపోతాడు. ఆ తర్వాత ఆ ఊరిలోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. ఆ ఊర్లో జాంబీలుగా మారిపోయిన వారిని ఈ గ్యాంగ్‌లోని మిగతావారు మామూలు మనుషులుగా మారుస్తారా? లేక వీళ్లు కూడా జాంబీలుగా మారిపోతారా? అక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతారనేది మిగతా కథ.

నటీనటులు: ఈ సినిమాలో తేజ నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్‌ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్‌ టీమ్‌ కూడా ది బెస్ట్‌ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఫీల్‌ అయ్యే ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయొచ్చు. జాంబీరెడ్డి ఒక్కసారైనా తప్పకుండా చూసే చిత్రం.

విశ్లేషణ: జాంబీల మేకప్‌, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హెలైట్‌. విజువల్స్‌, మేకింగ్‌ అన్నీ సరిగ్గా సరిపోయాయి. పాటలు పర్వాలేదనిపించాయి. కానీ సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్‌ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్‌లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త దృష్టి పెట్టుంటే సినిమాకి మరింత ప్లస్‌ అయ్యేది. ఫస్టాఫ్‌ కాస్త తేలిపోయినప్పటికీ సెకండాఫ్‌తో సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

టైటిల్: జాంబీ రెడ్డి
న‌టీన‌టులు: తేజ సజ్జ, ఆనంది, పృథ్వీ రాజ్‌, గెటప్‌ శ్రీను, అన్నపూర్ణమ్మ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: ప్రశాంత్‌ వర్మ
నిర్మాత‌లు:రాజశేఖర్‌ వర్మ
సంగీతం:మార్క్‌ కె. రాబిన్‌

హైలైట్స్: తేజ సజ్జ నటన, సెకండాఫ్‌
డ్రాబ్యాక్స్: ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు

చివరిగా: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయగలిగే ‘సినిమా’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu