టాలీవుడ్లో ఈరోజుల్లో, బస్‌స్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, నాయక్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ ఆనంది కోలీవుడ్ వెళ్లిన తర్వాత మరింత బిజీగా మారిపోయింది. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న ఆనంది తాజా చిత్రం ‘జాంబిరెడ్డి’ విడుదలకు రెడీగా ఉంది. కాగా వరంగల్‌లో ఈ హీరోయిన్ రహస్యంగా వివాహం చేసుకుంది. అలాగని లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. పెద్దలు కుదిర్చిన సంబంధమే. వరంగల్‌లోని ఫైవ్ స్టార్ హోటల్లో పరిమితంగా హాజరైన స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సోక్రటీస్, ఆనందిల వివాహం జరిగింది. సోక్రటీస్ కూడా దర్శకత్వ శాఖలోనే పనిచేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె ఇంత రహస్యంగా పెళ్లి చేసుకుందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.