నేచురల్ స్టార్ నాని హీరో గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అలరించగా,.. తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ జీరోత్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నానిని సుందర్ గా పరిచయం చేశారు.
ఇక పోస్టర్ లో నాని ఎర్రటి చొక్కా పంచె కట్టులో బ్లాక్ టాన్ షూ వేసుకొని ఒక ట్రావెల్ లగేజీ బ్యాగ్ పై రిలాక్సింగ్ గా వాలిపోయి నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇక అనౌన్స్మెంట్ పోస్టర్ లో చూసినట్లుగా నాని పొడవైన పేరును రివీల్ చేశారు. ‘K.P.V.S.S.P.R సుందర ప్రసాద్’ అంటే ‘కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్” అని గోత్రనామాలతో సహా నాని చెప్పుకొచ్చాడు. నాని భాష, వేషధారణ బట్టి ఇందులో నాని బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక చివరలో ఈ సినిమా ఆవకాయ సీజన్ లో అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. అంటే సమ్మర్ లో సుందరానికీ చక్కలిగింతలు మొదలుకానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫన్ రైడర్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాని తన ఖాతాలో మరో హాట్ ని వేసుకుంటాడేమో చూడాలి.