Zebra OTT release:
జిబ్రా.. సత్యదేవ్, దాలి ధనంజయ్ నటించిన తాజా ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామా. ఈ సినిమాను ఇశ్వర్ కార్తీక్ తెరకెక్కించారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది బాగానే నచ్చింది కలెక్షన్లు మాత్రం. అంత బాగా అందుకోలేకపోయింది.
ఆహా ప్లాట్‌ఫారమ్‌లో జిబ్రా Gold సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు డిసెంబర్ 18, 2024 నుంచి అందుబాటులో ఉంది. జనరల్ యాక్సెస్ డిసెంబర్ 20, 2024 నుంచి మొదలవుతుంది అని చెప్పారు. Gold యూజర్లు ఇప్పుడు సినిమా చూడొచ్చు, అహా లో గోల్డ్ లేని వారు అయితే డిసెంబర్ 20 నుండి చూడచ్చు.
#Zebra Telugu version will premiere on Aha Video on December 20th. pic.twitter.com/pIZfeL0QXC
— GLOBAL OTT (@global_ott) December 17, 2024
ఇప్పుడు, ఈ సినిమా ఆహా లో ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి. ఈ సినిమాలో సత్యరాజ్, పృథ్వీ భవానీ శంకర్, సునిల్, సత్య ఆకల, జెనిఫర్ పిచ్చినాటో, అమృతా ఇయంగర్ ఇలా ముఖ్యమైన పాత్రలలో నటించారు. సంగీతం రవి బస్రూర్ అందించగా, ఎస్ ఎన్ బాల సుందరం, ఎస్ ఎన్ రెడ్డి, దినేష్ సుందరం ఈ సినిమాను నిర్మించారు.
వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న సత్యదేవ్ కి ఈ సినిమా మంచి ఊరట ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. దీంతో ఈ సినిమాకి ఆహాలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. గతంలో థియేటర్లలో విడుదలైన వారానికే సత్యదేవ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ ఈ సినిమాకి థియేటర్లలో మంచి ఆదరణ లభించడంతో విడుదలైన దాదాపు నెల తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోకి రాబోతోంది.