మోహన్ బాబు… వైవిఎస్ చౌదరిల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. సలీం సినిమా సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని 2010 లో కేసు దాఖలు చేయగా, రీసెంట్ గా దీనిపై కోర్ట్ తీర్పు ఇచ్చింది. కాగా, కోర్టు తీర్పుకు అనుగుణంగా నెల రోజుల్లో డబ్బు కట్టాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటె, ఇప్పుడు కొత్తగా మరో వివాదం తెరమీదకు వచ్చింది. రంగారెడ్డి లోని సరూర్ నగర్‌లో వైవిఎస్ చౌదరి కొంత భూమిని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలోనే మోహన్ బాబు కూడా కొంతభూమిని కొనుగోలు చేశారు. మోహన్ బాబు కొనుగోలు చేసిన భూమిలో ఇంటిని నిర్మించుకోగా, వైవిఎస్ చౌదరి మాత్రం భూమిని అలాగే ఖాళీగా ఉంచారని, కొన్ని రోజుల క్రితం సలీం విషయం జరిగిన గొడవల కారణంగా సరూర్ నగర్ లోని తన స్థలంలోకి తనను అనుమతించడంలేదని, బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటుంటున్నారని చెప్పి లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా రిప్లయ్ ఇవ్వాలని లేదంటే చట్టపరంగా ప్రొసీడ్ అవుతానని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.