HomeTelugu Trendingసంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై యువీ ట్వీట్‌

సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై యువీ ట్వీట్‌

Yuvraj singh wishes sanjayబాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఇటీవలే ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శ్వాసకోస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సంజయ్‌ ఆరోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ స్పందించారు.

”సంజయ్‌ దత్‌.. ఈ సమయంలో మీరు ఫైటర్‌లా పోరాడాలి. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు మీరు మరింత దృఢంగా ఉండాలి. మీరు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్‌ చేశారు. గతంలో యువరాజ్‌ సింగ్‌ ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ బారినపడి మెరుగైన చికిత్స తీసుకొని కోలుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వైద్యం నిమిత్తం కొంచెం విరామం తీసుకుంటున్నట్లు సంజయ్‌ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ”వైద్యం నిమిత్తం నా పని నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, స్నేహితులు నాతోనే ఉన్నారు. నా ఆరోగ్యం పట్ల వదంతులు సృష్టించొద్దని కోరుతున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా”అని ట్వీటర్‌లో పేర్కొన్నారు సంజయ్‌దత్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu