కోలీవుడ్ స్టార్ దర్శకుడు సెల్వరాఘవన్ అభిమానులకు న్యూయర్ సందర్భంగా ప్రకటన చేశాడు. 2010లో విడుదలైన ‘యుగానికి ఒక్కడు’ మూవీ మాసివ్ హిట్ సొంతం చేసుకుంది. కార్తీ హీరోగా నటించిన ఈ అద్భుత చిత్రానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. సీక్వెల్ కోసం కూడా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ దర్శకనిర్మాతల నుంచి పదేళ్లుగా ఎటువంటి అప్డేట్ లేదు. అటువంటిది దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమా సీక్వెల్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్స్‌లో ప్రధాన పాత్ర స్టార్ హీరో ధనుష్ చేయనున్నాడు. అయితే హీరోను మార్చడానికి కథ కారణమా లేదంటే ఇంకేదైన సమస్య అనేదానిపై క్లారిటీ లేదు. ఈ సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనిని ధనుష్ తన ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. ఈ పోస్టర్ చూస్తుంటే మొదటి భాగం అంతం అయిన చోట నుంచే రెండవ భాగం మొదలవుతుందని అర్థం అవుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
A magnum opus !! The pre production alone will take us a year. But a dream film from the master @selvaraghavan ! The wait will be long. But we will give our best to make it all worth it. AO2 ..The Prince returns in 2024 https://t.co/HBTXeN66iA
— Dhanush (@dhanushkraja) January 1, 2021