HomeTelugu Big Storiesచైతు ఆట మొదలెట్టాడు!

చైతు ఆట మొదలెట్టాడు!

అక్కినేని నాగచైతన్య హీరోగా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘యుద్ధం శరణం’. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముదుకు తీసుకొచ్చారు. ట్రైలర్ ను బట్టి ఇది రొటీన్ సినిమా అనే అనిపిస్తుంది. అయితే దర్శకుడు తన కథనంతో మ్యాజిక్ చేయగలిగితే హిట్ అందుకొనే అవకాశాలు ఉన్నాయి. హీరో, హీరోయిన్, ఓ అందమైన కుటుంబం.. వారికి విలన్ కారణంగా కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. వాటిని అడ్డుకొని హీరో ఎలా విజయం సాధించాడనే పాయింట్ తో దశాబ్ధాలుగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు చైతు నటిస్తోన్న ‘యుద్ధం శరణం’ సినిమా సంగతి కూడా అంతే.. అయితే ఆ రొటీన్ స్టోరీను డైరెక్టర్ దాచాలని ప్రయత్నించలేదు. ట్రైలర్ లోనే కథ ఇది అని చెప్పే ప్రయత్నం చేశాడు. 
ఇక తెరపై సినిమాను ఎలా ప్రెజంట్ చేసాడనేది ముఖ్యమైన విషయం. అయితే ఈ ట్రైలర్ లో కొత్తగా కనిపిస్తుంది మాత్రం విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ అనే చెప్పాలి. తన మెకోవర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాతో శ్రీకాంత్ కు విలన్ గా మంచి పేరొస్తుందనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu