అక్కినేని నాగచైతన్య సినిమాలకు మార్కెట్ పరంగా పాతిక కోట్లు మాత్రమే డిమాండ్ ఉంది. ఈ లెవెల్ ను పెంచడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కలిసి రావడం లేదు. ప్రేమమ్ సినిమాకు ఇరవై కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇటీవల విడుదలైన ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ ఇరవై ఐదు కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది.
దీంతో తన మార్కెట్ పరిధిని పెంచుకోవాలని నిర్ణయించుకున్న చైతన్య ఇప్పుడు పక్క రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు.
దీంతో తన తదుపరి సినిమా తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ‘యుద్ధం శరణం గచ్చామి’ సినిమాలో నటిస్తోన్న చైతు ఆ సినిమా అన్ని భాషలకు సూట్ అవుతుందని థ్రిల్లర్ జోనర్ కు అన్ని ప్రాంతాల్లో ఆదరణ లభిస్తుండడంతో పక్క మార్కెట్లలోనూ ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నాడు. ముందు ఒకట్రెండు డబ్బింగ్ సినిమాలు అక్కడ రిలీజ్ చేసి ఆ తరువాత స్ట్రెయిట్ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాడు. మరి ఈ ప్రయత్నంలో చైతు ఎలాంటి రిజల్ట్స్ ను అందుకుంటాడో.. చూడాలి!