Homeపొలిటికల్YSRCP: ప్రత్యేక హోదా అన్నారు కానీ ఇప్పుడు ప్రతిపక్షం కోసం పోరాడుతున్నారు

YSRCP: ప్రత్యేక హోదా అన్నారు కానీ ఇప్పుడు ప్రతిపక్షం కోసం పోరాడుతున్నారు

YS Jagan
YS Jagan struggling to get the opposition party status

YSRCP Manifesto: 2019లో ఎన్నికల సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తెప్పిస్తానని చేసిన వాగ్దానాలు. తెలంగాణతో విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇప్పిస్తామని జగన్ పలుసార్లు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ సీపీకి ఎక్కువ ఓట్లు పడటానికి కూడా అదే కారణం.

YSRCP AP Elections: కానీ పవర్ లో ఉన్నప్పుడు మాత్రం దీనికి సంబంధించి ఈ ఒక్క పని కూడా జరగలేదు. ఎన్నికల ముందు వరకు కూడా ప్రత్యేక హోదా అంటూ కలవరించిన జగన్ ఎన్నికల తర్వాత మాత్రం ఆ మాటే ఎత్తలేదు. అలా గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంటూ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన జగన్ ఈసారి ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కోసం కష్టాలు పడుతున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వరకు కూడా క్యాంపెయిన్లలో మాట్లాడుతూ వైయస్ జగన్ వై నాట్ 175 అంటూ నినాదాలు చేశారు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం 1 ప్లస్ 7 ప్లస్ 5 అంటే కనీసం 13 సీట్లు కూడా తెచ్చుకోలేక పోయారు. అలాంటి నాయకత్వం వాళ్ళది అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యన అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ మాటలను ఎద్దేవ చేశారు.

YSRCP Opposition Party:

ఎన్నికల్లో కనీసం 10% ఓట్లు కూడా రాకపోవడంతో వైఎస్ఆర్సిపి కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా ఉండకూడదు. కానీ విపక్షంలో ఉన్న పార్టీనే ప్రతిపక్ష పార్టీ అవుతుందని కేంద్ర ప్రభుత్వంలో ఉందని, టిడిపి జనసేన కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి విపక్షంలో ఉన్న ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్సిపి అని.. అదే ప్రతిపక్ష పార్టీ అవుతుందని జగన్ కామెంట్లు చేశారు.

అయితే మరోవైపు ప్రజలు మాత్రం పవర్లోకి రాకముందు వరకు ప్రత్యేక హోదా తెప్పిస్తానని కబుర్లు చెప్పిన జగన్ పవర్ లో ఉన్నంతకాలం ఏమీ చేయకుండా ఇప్పుడు ప్రతిపక్షం పార్టీ హోదా ఇవ్వడం లేదని పోరాడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేక పోయిన వైఎస్ఆర్సిపి గతంలో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తుందని ఎలా నమ్మారు అని రూలింగ్ పార్టీ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu