Ys Sharmila: ఏపీ పాలిటిక్స్ ప్రస్తుతం హాట్ హాట్‌గా మారాయి. పదవి కోసం అన్నీ పార్టీలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో సభలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు నాయకులు. ఈ క్రమంలోనే కడప జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా షర్మిల హాజరయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. జగన్ అన్న అప్పటి మనిషి కాదని.. ఇప్పటి జగన్ అన్న ను ఎప్పుడు చూడలేదని ఫైర్ అయ్యారు. నా మీద స్టోరీలు అల్లుతున్నారు రోజుకో జోకర్ ను తెస్తున్నారు. నా మీద బురద చల్లుతున్నారు. నిన్న ఒక జోకర్ తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట.. జగన్ జైల్లో ఉన్నప్పుడు.. నా భర్త అనిల్ సోనియా ను కలిశారట.. జగన్ ను బయటకు రానివ్వద్దు అని లాబియింగ్ చేశామట.. ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ లేడు.. ఒక పెద్ద మనిషి పేరును కూడా మీరు వదలడం లేదు. మీ కుట్రలకు అంతే లేదు అని మండిపడ్డారు.
తనకు పదవి ఆకాంక్ష ఉంటే ‘నాన్న ను అడిగి తీసుకోనా ? వైసీపీ లో నైనా పదవి తీసుకోనా ? అనిల్ , భారతి రెడ్డి తో కలిసి సోనియా వద్దకు వెళ్ళారని గుర్తు చేశారు. భారతి కి తెలియకుండా సోనియా ను అడిగారా అని ప్రశ్నించారు. భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా ? కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడ చెప్పినట్లు రికార్డ్ కూడా లేదు. తెలంగాణ లో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తోంది. తన పై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారని మండిపడ్డారు.
ఇదే సాక్షి సంస్థలో నాకు భాగం ఉంది. సగం భాగం ఇచ్చారు వైఎస్సార్. సగం భాగం ఉన్న నాపై నా సంస్థ బురద చల్లుతుందని మండిపడ్డారు. విలువలు ,విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారు.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చానని. ప్రత్యేక హోదా వచ్చే వరకు. ఇక్కడ నుంచి కదలనని.. పోలవరం వచ్చే వరకు కదలనని.. ఏం పీక్కుంటారో’ పీక్కోండని స్పష్టం చేశారు. షర్మిల ఆవేశం చూసి కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోయారు.