Homeపొలిటికల్YS Sharmila: మా అన్న జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడు?

YS Sharmila: మా అన్న జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడు?

YS Sharmila said i will serve like YSR

YS Sharmila: ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల.. జగన్‌పై మండి పడ్డారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదు.

బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఆక్షేపించారు. ఇమామ్ లకు రూ.15 వేలు వేతనం, ముస్లిం బ్యాంక్, చనిపోతే రూ.5 లక్షల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని ఆరోపించారు.

చంద్రబాబు, జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరన్న షర్మిల.. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని వీళ్లు బానిసలు అయ్యారు. విభజన హామీలు ఒక్కటీ బీజేపీ నెరవేర్చలేదు, హోదాపై బీజేపీ మోసం చేసింది. వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేది. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారు.

మూడు సార్లు శంకుస్థాపన చేసి ఎంపీలు నిద్రపోతున్నారు. ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ గురించి మాట్లాడలేదు. కడప – బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం. కానీ ఆ లైన్ ను జగన్ వద్దన్నారు. సీబీఐ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఎలా టిక్కెట్ ఇచ్చారని ప్రశ్నించారు.

బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటా.. వైఎస్సార్ లాగా సేవ చేస్తా అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu