Homeపొలిటికల్YS Jagan: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. కోర్టు మెట్లెక్కిన మాజీ సీఎం

YS Jagan: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. కోర్టు మెట్లెక్కిన మాజీ సీఎం

YS Jagan’s Passport Drama: Court’s Stunning Verdict Revealed!
YS Jagan’s Passport Drama: Court’s Stunning Verdict Revealed!

YS Jagan in Court:

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానాల తీర్పులను పెడచెవిన పెట్టి చట్టాన్ని పాటించకపోతున్నారని విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. న్యాయ వ్యవస్థకు అవమానం కలిగిస్తూ, తనపై వచ్చిన కేసులను తిరస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే తనపై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం కూడా విమర్శల పాలైంది. తాజా పరిణామాల ప్రకారం, వైఎస్ జగన్ న్యాయస్థానంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేయడం నుంచి తప్పించుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారాయణ కూడా జగన్‌ను విచారణకు హాజరుకావాలని అన్నారు. ఫైనల్ గా జగన్ తన పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాస్‌పోర్ట్ నూతనీకరణకు అనుమతి కోరుతూ, ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

Read More: Jagan’s London plans hit roadblock amid legal troubles

హైకోర్టు ఆయన అభ్యర్థను మన్నించి పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు అనుమతి ఇచ్చింది. అయితే, జగన్‌ను విజయవాడ పీపుల్స్ కోర్టులో హాజరుకావాలని, రూ. 20,000 ఫైన్ సమర్పించాలని ఆదేశించారు. జగన్, సెప్టెంబర్ 3న యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.. కానీ ఏపీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో, ఆయనకు ఉన్న దౌత్య పాస్‌పోర్ట్ హక్కు కోల్పోయారు. అందుకే, జగన్ పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం కోర్టును ఆశ్రయించారు.

తాజాగా, జగన్ పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు అనుమతి అయితే వచ్చింది కానీ కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత జగన్ మొదటిసారి న్యాయస్థానంలో హాజరయ్యారు. కానీ జగన్‌పై కేసులు పెండింగ్‌లో ఉండడంతో, ఇప్పటి నుంచి జగన్ కోర్టుకు రావడం మామూలు విషయం అయిపోతుంది అని ప్రజలు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu