Homeపొలిటికల్YS Jagan: ఏపీ సీఎంపై రాయితో దాడి

YS Jagan: ఏపీ సీఎంపై రాయితో దాడి

YS Jagan

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలోని సింగ్‌నగర్ చేరుకున్న సమయంలో రాయితో ఓ దుండగుడు దాడిచేసినట్లు చెప్తున్నారు. దీంతో జగన్‌ ఎడమ కంటికి పైన బలమైన గాయమైంది. రక్తపు మరకలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో జగన్‌పై గుర్తుతెలియని వ్యక్తి జగన్‌పైకి రాయి విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో జగన్‌కు పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా గాయమైనట్లు చెప్తున్నారు. అయితే జగన్‌పై దాడి జరగడంలో టీడీపీ వాళ్ల హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని అంటున్నారు. సీఎం జగన్‌కు బస్సుయాత్ర ద్వారా ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేక టీడీపీ నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే జగన్‌కు బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత జగన్ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై సానుభూతికోసమే జగన్ ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలో కోడికత్తి కేసు పేరుతో డ్రామాలు ఆడారని, అలాగే ఇప్పుడు ప్రజల సానుభూతి కోసం మరో డ్రామా మొదలు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu