Homeపొలిటికల్YS Jagan: జూన్ 4న దేశం షాక్ అవుతుంది.. గెలుపుపై ధీమా

YS Jagan: జూన్ 4న దేశం షాక్ అవుతుంది.. గెలుపుపై ధీమా

YS Jagan YS Jagan,YSRCP,jagan,tdp,chandrababu,janasena,pawan kalyan

YS Jagan: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముగిశాయి. రికార్డ్ స్థాయిలో 81.86శాతం పోలింగ్ నమోదైంది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడంతో.. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. పోలింగ్ శాతం పెరగడం ప్రతిపక్షానికి అనుకూలమని.. తాము అధికారంలోకి రావడం ఖాయమని ఎన్డీఏ కూటమి చెబుతుంటే. వృద్ధులు, మహిళలు భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారని.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. మరో పక్క ఎగ్జిట్ పోల్స్ పేరుతో పలువురు సర్వేలు కూడా చేస్తున్నారు.

కాగా ఫలితాలపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ జగన్‌ తొలిసారి స్పందించారు. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐప్యాక్) ప్రతినిధులతో సీఎం వైఎస్‌ సమావేశమయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ఐప్యాక్ కార్యాలయంలో సీఎం ఉన్నారు. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు ఐప్యాక్ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు.

ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మేం మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.

2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. జూన్‌ 4న రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది అని అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu