YS Jagan Petition:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి YS Jagan సెప్టెంబర్ నెలలో యూకేకి వెళ్లేందుకు సీబీఐ కోర్టులో అనుమతి కోరారు. ఆయన తన కూతురు, యూకేలో చదువుకుంటున్నందున, ఆమెతో సమయం గడిపేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సీబీఐ తన కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ వాదనలు ప్రకారం, జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం విచారణ కి ఆటంకం కలిగిస్తుంది అని కోర్టుకు తెలియజేసింది. సీబీఐ తన కౌంటర్‌లో జగన్ విదేశీ పర్యటనను అనుమతించవద్దని స్పష్టంగా పేర్కొంది.
కోర్టు ఈ కేసును వాయిదా వేసి, తీర్పును ఆగస్టు 27కి వాయిదా వేసింది. ఇప్పుడు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తారా లేదా అని వేచి చూడాలి. సాధారణంగా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతి నిరాకరిస్తుంది. కానీ, జగన్ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఈ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు తర్వాత జగన్ ఒక్క చోట కూడా కుదురుగా ఉండటం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ను వదిలేసి కర్ణాటక చుట్టూ తిరుగుతున్న జగన్ ఇప్పుడు ఏకంగా ఏడు సముద్రాలు దాటి మరీ పరదేశం వెళ్తున్నారా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.