Homeపొలిటికల్YS Jagan Pending Cases: వైఎస్ జగన్ కి పెద్ద షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

YS Jagan Pending Cases: వైఎస్ జగన్ కి పెద్ద షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

YS Jagan Pending Cases
YS Jagan Pending Cases to reopen

YS Jagan Pending Cases:

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకదాని తర్వాత మరొక షాక్ ఎదురవుతూనే ఉంది. ఈసారి కూడా వైసిపి పవర్ లోకి వస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్న జగన్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి పెద్ద షాక్ ఇచ్చింది. ఒకవైపు టిడిపి పవర్ లోకి రావడమే షాక్ అనుకున్నా జగన్ కి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం మరొక పెద్ద షాక్ గా మారింది.

ఇలా వరుసగా షాకులు తగిలించుకున్న జగన్ కి తెలంగాణ కోర్టు ఇప్పుడు మరొక పెద్ద షాక్ ఇచ్చింది. జగన్ పైన ఇప్పటికే 20 పైగా సిబిఐ కేసులు ఉన్నాయని తెలిసిన విషయమే. ఈ కేసుల విషయంలో విచారణ కొనసాగించడానికి కోర్టు ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు.

ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని జగన్ విచారణలను ఎప్పటికప్పుడు ఎగ్గొట్టారు. 2024 లో జరిగిన ఎన్నికలకి ముందు కాపు సంఘానికి చెందిన హరి రామ జోగయ్య అనే ఒక సీనియర్ నేత తెలంగాణ కోర్టులో జగన్ పై ఉన్న పెండింగ్ సిబిఐ ఈడి కేసులపై రోజువారి విచారణలు చేపట్టాలి అని పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టు కూడా దానిని ఒప్పుకుంది. తెలంగాణ హైకోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు కి జగన్ పై ఉన్న కేసులపై విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్ లోనే ఉండిపోయిన ఈ విచారణ ఇప్పుడు మళ్లీ వేగవంతం కానుంది.

YS Jagan Pending Cases:

ఇప్పటిదాకా అంటే జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి. తన సీఎం పదవిని, బాధ్యతలను కారణంగా చూపించి ఈ కేసులను, వాటి సంబంధిత విచారణలను జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్ ముఖ్య మంత్రి కాదు. పదవి పోవడం పక్కన పెడితే ఎన్నికలలో కేవలం 11 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న జగన్ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా అందుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కోర్టు విధిస్తున్న సవాళ్లను జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రఘు రామ కృష్ణ రాజు జగన్ కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో PIL దాఖలు చేశారు. జగన్ పై పెండింగ్ లో ఉన్న కేసులపై ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాలని కోర్టును కోరారు. అధికారాన్ని కోల్పోయిన జగన్‌ ఈ కేసుల నుంచి తప్పించుకుంటారో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu