Homeతెలుగు Newsమళ్లీ మొదలెట్టిన జగన్‌..

మళ్లీ మొదలెట్టిన జగన్‌..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విశ్రాంతి అనంతరం వైఎస్‌ జగన్‌ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు.

2 11

వజ్రసంకల్పమే ఊపిరిగా ముందుకుసాగుతున్న జననేత వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు పాయకపాడుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జననేతకు తమ సమస్యలు విన్నవించేందుకు, తమ కష్టాలు చెప్పేందుకు మహిళలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలను పలుకరిస్తూ.. జనంతో మమేకమవుతూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు‌, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu