ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తి అవుతుంది. ఫలితాలు కూడా వచ్చేసి కొత్త ప్రభుత్వం తన పనులు చేయడం కూడా మొదలు పెట్టేసింది. ప్రజలు కూడా జగన్ ని మరిచిపోయి గుండెల మీద చేతులు వేసుకొని కూర్చున్నారు. కానీ ఎంత జరిగినా YS Jagan Mohan Reddy మాత్రం ఎన్నికల రిజల్ట్ ను జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది.
జగన్ ఇక ముఖ్యమంత్రి కాదు అన్న విషయాన్ని ఆయన నమ్మిన నమ్మకపోయినా పర్వాలేదు కానీ.. ఆయన ఇంకా పవర్ లో ఉన్నట్టే ప్రవర్తిస్తూ ఉండటం మీద మాత్రం చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అయితే అధికారంలో ఉన్నప్పుడు వైసిపి నాయకులు ప్రజల గురించి పట్టించుకోకుండా కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ తిరిగారో.. ఇప్పుడు కూడా అలానే ప్రజలకి దూరంగా మసులుతున్నారు.
ఒకవైపు అధికారంలోకి వచ్చిన కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బిజీగా ఉంది. కూటమి గెలవడానికి ముఖ్య కారణం అయిన పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత దగ్గరగా ఉంటూ ఇంకా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మరొకవైపు వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయాలకు అందరూ కూడా కట్టకుండా కూర్చున్నారు.
నిజానికి వైసీపీకి చేతినిండా పని ఉంది. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇళ్ల నుంచి బయటకే రావడం లేదు. ఇక పార్టీ అధినేత జగన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎంతసేపు బెంగళూరు చుట్టూ తిరగడం.. లేదా తనకి సెక్యూరిటీ కావాలి అంటూ మొర పెట్టుకోవడం తప్ప ఇంకో పని చేయడం లేదు.
అధికారంలో ఎలాగో ప్రజల గురించి పట్టించుకోలేదు.. వైసీపీ ప్రజల మధ్యలోకి వచ్చి వారికి దగ్గర అయితే మంచిది అని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ప్రజల నుంచే తమకి సెక్యూరిటీ కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలకు కనీసం పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. వైసిపి నాయకుల వైఖరి చూస్తూ ఉంటే.. వైసీపీ లీడర్లు తాము ఇంకా పవర్ లో ఉన్నట్లుగానే భావిస్తున్నారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి వైసిపి ఎదుర్కొన్న ఘోర పరాజయం వారికి గుర్తుందో లేదో వారికే తెలియాలి.