Homeతెలుగు Newsమీ ఆశీర్వాదం, ఆ దేవుని దీవెనలే నడిపంచాయి: జగన్‌

మీ ఆశీర్వాదం, ఆ దేవుని దీవెనలే నడిపంచాయి: జగన్‌

9 7నడిచింది నేనైనా.. నడిపించింది మాత్రం మీరు, ఆ దేవుని దీవెనలే అన్నారు వైసీపీ అధినేత వైస్ జగన్… ఇచ్ఛాపురంలో నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సభలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయన… ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో.. ప్రజల గుండె చప్పుడును.. నా గుండె చప్పుడుగా మార్చుకున్నానని తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ 3 వేల కిలో మీటర్లు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దూరం 3440 కిలో మీటర్లు… ప్రజాసంకల్ప పాదయాత్ర మాత్రం అన్ని రికార్డులను దాటేసిందన్నారు. ఎంత దూరం నడిచాం అన్నది ముఖ్యం కాదు.. ఎంత మంది ప్రజలను కలిశాం. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యమన్న ఆయన… 600 హామీలు ఇచ్చి ప్రతీ కులాన్నీ ఎలా మోసం చేయొచ్చదానిలో పీహెచ్ డీ చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు. రాష్టంలో కరువు పరిస్థితులు ఉంటే.. రెయిన్ గన్ ల పేరుతో చంద్రబాబు సినిమా చూపించారంటూ అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివన్న యథార్థ గాథ వినిపించారు జగన్.

జాతీయ రాజకీయాల పేరుతో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తిరుగుతారు కానీ.. మన రాష్ట్రంలో రైతన్నల కష్టాలను తీర్చాలన్న ధ్యాసే చంద్రబాబుకు లేదని మండిపడ్డారు జగన్… రైతు ఆదాయంలో మన రాష్ట్రం రైతులు దేశంలోనే 28వ స్థానంలో ఉంటే.. రైతు అప్పుల్లో మాత్రం 2వ స్థానంలో ఉన్నామన్న వైసీపీ అధినేత… గ్రోత్ రేట్ లో నెంబర్ 1 అంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే చంద్రబాబును నమ్మం బాబూ.. అని రైతులు, ప్రజలు అంటున్నారన్నారు. పొదుపు సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మల రుణాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ. 14,2014 కోట్లు ఉంటే… ఇప్పుడవి వడ్డీలు పెరిగిపోయి రూ. 22,174 కోట్లకు చేరాయి. సున్నా వడ్డీ రుణాలకు కూడా బాబు ఎగనామం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. బాబు వచ్చాడు.. కానీ జాబు రాలేదు.. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు.. అని నిరుద్యోగ యువత అంటున్నారని వ్యాఖ్యానించిన జగన్… రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ఇప్పుడవి 2.40 లక్షలకు పెరిగినా.. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రతీ ఇంటికీ రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పి.. ఇప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు, అదీ కొద్ది మందికే వెయ్యి ఇస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అక్షరాలా 6 వేల ప్రభుత్వ స్కూళ్లు మూసేశారని… ఎస్సీ, ఎస్టీల హాస్టళ్లు మూసేశారన్నారు జగన్. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న బడుల్లో టీచర్లు లేరు. పుస్తకాలు ఇవ్వటం లేదు.. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ.. నారాయణ, చైతన్య సంస్థలను మాత్రం పెంచుతున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోంది. రేషన్ కార్డు నుంచి మరుగుదొడ్డి వరకూ ఏది కావాలన్నా.. లంచం.. లంచం. గ్రామాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు జగన్. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి, అందులో నలుగుర్ని మంత్రుల్ని చేశారని మండిపడ్డారు. తాను చెప్పింది చేయకపోతే.. ఆ రాజకీయ నాయకుడ్ని రాజీనామా చేయించి ఇంటికి పంపించేలా చేయాలి.. అటువంటి విశ్వసనీయ రాజకీయాలు రావాలని పిలుపునిచ్చారు జగన్… చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలంటే.. అది జగన్ ఒక్కరి వల్ల సాధ్యపడదు. జగన్ కు మీ అందరి దీవెనలు కావాలన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu