ఆర్‌ఎక్స్-100 సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతికి రెండో సినిమా అవకాశం వచ్చి చేజారిపోయిందట. ఈ దర్శకుడు తొలి సినిమాతో సాధించిన ఘన విజయానికి రెండో సినిమా ఈపాటికే సెట్స్‌పైన ఉండాలి. ఇద్దరు యంగ్ హీరోలు ఇతడికి హ్యాండిచ్చారని సమాచారం. ఆర్‌ఎక్స్-100 సినిమా విజయం తర్వాత అజయ్ భూపతి యంగ్ హీరో రామ్‌కు ఓ కథ వినిపించాడట. పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశమొచ్చి అజయ్‌భూపతి కథను రామ్ తిరస్కరించాడట. అలాగే మరో హీరో నితిన్ కూడా తనకు వేరే ప్రాజెక్టులున్నాయని అజయ్ భూపతి కథను పక్కన పెట్టాడని చెబుతున్నారు. దీంతో ఈ దర్శకుడు అదే కథను బెల్లంకొండ శ్రీనివాస్‌కు వినిపించి ఓకే అనిపించుకున్నాడట.
అజయ్ భూపతి కథ నచ్చకే ఈ ఇద్దరు హీరోలు పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పారితోషికం విషయంలో తేడా వచ్చి దర్శకుడు వెనక్కి తగ్గినట్టు ప్రస్తుతం అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తాను అనుకున్న రెమ్యూనరేషన్ ఇస్తాననడంతో ఓకే చేసినట్టు సమాచారం.