HomeTelugu TrendingSamantha సినిమాలో నటిస్తున్న యువ హీరో ఎవరో తెలుసా?

Samantha సినిమాలో నటిస్తున్న యువ హీరో ఎవరో తెలుసా?

Young Hero to star in Samantha's next?
Young Hero to star in Samantha’s next?

Samantha Upcoming Movies:

సమంత రూత్ ప్రభు వెబ్ సిరీస్ సిటడెల్: హనీ బన్నీ నవంబర్ 7, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. సిటడెల్ సిరీస్‌లో సమంత మరోసారి ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోడానికి రెడీ అయ్యింది.

ఈ సమయంలో సమంత నటిస్తున్న కొత్త సినిమాలు అంతగా లేకపోయినా, ఆమె నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆమె స్వయంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

ఇంతకుముందు 35-చిన్న కథ కాదు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ప్రియదర్శి ప్రధాన పాత్రలో మరో సినిమా కూడా సమంత బ్యానర్ పై ప్రారంభం కానుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

దీనితో పాటు, సమంత మరో ప్రాజెక్ట్‌లో కూడా భాగం అయ్యింది. రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషిస్తుంది. అనిల్ బర్వే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సిరీస్‌ వివరాలు త్వరలో బయటపడనున్నాయి.

Read More: ప్రభాస్ హీరోయిన్ తో Nani కాంబో సెట్! ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే

Recent Articles English

Gallery

Recent Articles Telugu