నారా లోకేశ్ యువగళం స్పందన చూసి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదు. ఏకు లాంటి వాడు మేకు అయ్యేలా ఉన్నాడని జగన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. అందుకే, నారా లోకేశ్ మొదటిరోజున సక్సెస్ అయిన విధంగా రెండో రోజు అవ్వకూడదు అని జగన్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. లోకేశ్ సభకు జనం రాకుండా కట్టడి చేసింది. అయినా టీడీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇది జీర్ణించుకోలేని కూలీ మీడియా ఎప్పటిలాగే లోకేశ్ పై విమర్శలు చేస్తూ అతని స్థాయి తగ్గించే ప్రయత్నం చేశాయి. నారా లోకేశ్ హీరోగా తెరకెక్కిన యువగళం అనే సినిమా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది అంటూ నెగిటివ్ కథనాలు జనంలోకి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నిజంగా ఈ నెగిటివ్ ప్రచారంలో నిజం ఉంటే.. మొదటి రోజు నారా లోకేశ్ పాదయాత్రకు అభిమానులు, టీడీపీ శ్రేణుల ఉత్సాహంతో ఎందుకు కనిపిస్తారు ?, లోకేశ్ సభలో ఎందుకు సందడి కనిపిస్తోంది ?. లోకేశ్ పాదయాత్ర రెండో రోజు వచ్చే సరికి తుస్సుమనిపించింది అంటూ ప్రచారం చేసినంత మాత్రాన నిజం అయిపోదు కదా. లోకేశ్ రెండోరోజు పాదయాత్ర కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైంది. జనం భారీగా వచ్చారు. అయినా లోకేశ్ పాదయాత్రకు ఆశించిన స్థాయిలో ఇమేజ్ రాలేదు అంటూ కూలీ మీడియా గాలి వార్తలు రాసింది.
మరీ ముఖ్యంగా యువగళం అని పేరులో తప్ప, యువకుడిలో కనబడాల్సిన ఉత్సాహం లోకేశ్‌లో కనిపించడం లేదట. ఉత్సాహం ఎలా ఉండాలి ?, క్యాసినో ఆడుకుంటూ లేదా ఫోన్స్ లో ఏపీ మంత్రులు సాగించిన శృంగార లీలల్లా ఉండాలా ?, అయినా లోకేశ్ లో ఉండాల్సింది ఉత్సాహం కాదు, పట్టుదల, ప్రజలకు మేలు చేయాలనే తపన. లోకేశ్ స్పీచ్ విన్నాక, ఆ తపన, ఆ పట్టుదల పుష్కలంగా ఉన్నాయని అర్ధం అవుతుంది. అందుకే, పాదయాత్రలో భాగంగా లోకేశ్ చేయెత్తి పిడికిలి బిగించిన ప్రతిసారి టీడీపీ శ్రేణుల్లో ఆవేశం కనిపించింది. అయినా ఇదంతా జగన్ కూలీ మీడియా ఒప్పుకోదు. లోకేశ్ కి ఏది చేత కావడం లేదు అంటూ విమర్శిస్తూనే ఉంటుంది.
కానీ, లోకేశ్ జనానికి చేరువయ్యే తీరును చూస్తుంటే.. కచ్చితంగా టీడీపీకి ఈ సారి లోకేశ్ బలం అయ్యేలా ఉన్నాడు. ఏ కొడుకు ఏ తల్లి గురించి వినకూడని మాటను కూడా లోకేశ్ వినాల్సి వచ్చింది. మూడు సార్లు సీఎంగా చేసిన తన తండ్రి పబ్లిక్ గా కన్నీళ్లు పెట్టుకోవడం లోకేశ్ లో కసిని పెంచింది. గతంలో జగన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రతో ఇప్పుడు లోకేశ్ నడకను పోల్చుకుంటున్నారు. జగన్ రెడ్డి కంటే లోకేశ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రజలతో మమేకం అవుతున్నాడు. రెండోరోజుకే లోకేశ్ నీరసించినట్టుగా కనిపిస్తున్నారనే ఫేక్ వార్తల వల్ల జగన్ రెడ్డికి ఎలాంటి ఉపయోగం లేదు. కూలీ మీడియా మరో రకంగా లోకేశ్ ను దెబ్బ కొట్టేందుకు ఎత్తులు వేసుకోవాల్సిందే. అయినా, లోకేశ్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు టీడీపీ సోషల్ మీడియా ప్రయత్నాలు చేస్తోంది అంటూ వస్తున్న గాలి వార్తలను కూడా ‘గాలి కూలీలు’ కూడా నమ్మడం లేదు జగన్ రెడ్డి. కావున, లోకేశ్ తో జర జాగ్రత్త.