Homeపొలిటికల్జగన్ రెడ్డిని గెలిపించి.. ఆంధ్ర పీకను కోరికేసింది మీరే

జగన్ రెడ్డిని గెలిపించి.. ఆంధ్ర పీకను కోరికేసింది మీరే

You are the one who won Jagan Reddy and wanted Andhra Pika

ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడం ఎలా ?, ఏపీ అప్పుల కుప్పగా మారిందని స్వయంగా కేంద్రమే వెల్లడించింది అంటే.. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆంధ్ర ప్రభుత్వం అప్పుల వ్యవహారం రాతపూర్వకంగా వివరాలు వెల్లడించారు. ఆ వివరాల సారాంశం ఏమిటో తెలుసా ?, 2019 తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండింతలయ్యాయి. పైగా ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోంది. అయినా, వైసీపీ వారు ఒప్పుకోరు. ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి.. బడ్జెట్ లెక్కల ప్రకారమే చూద్దాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు రూ. 4, 42,442 లక్షల కోట్లు అని పంకజ్ చౌదరి తెలిపారు. అదే 2019లో జగన్ ప్రభుత్వ అప్పు రూ. 2,64, 451 లక్షల కోట్లు ఉండగా.. 2020 లో రూ.3,07, 671 లక్షల కోట్లుకు చేరింది. ఇక 2021లో జగన్ ప్రభుత్వ రూ.3,53,021 లక్షల కోట్లు, 2022 లో జగన్ ప్రభుత్వ రూ.3,93,718 లక్షల కోట్లుకు చేరింది. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 లక్షల కోట్లకు చేరింది.

ఈ అప్పుల లెక్కలను చెప్పింది ప్రతిపక్షాలు కాదు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి. కాబట్టి, ఈ లెక్కల్లో ఎలాంటి బొక్కలు లేవు అని ప్రజలు అర్థం చేసుకోవాలి. అన్నట్టు ఇంతేనా ?, ఇది జగన్ రెడ్డి గోరి ప్రభుత్వం. సో.. అంతకు మించి ఉంటాయి ఆయన గారి అప్పులు. ఎలానో చూద్దాం రండి. బడ్జెట్ అప్పులు కాకుండా కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఇంకా అదనం. ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రినే వెల్లడించారు. ఇప్పటికే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అప్పు పది లక్షల కోట్లకు చేరిందని ఓ అంచనా. దీనికితోడు ఏటేటా జగన్ రెడ్డి ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మరోవైపు కొత్త అప్పుల కోసం వైసీపీ సర్కారు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జనవరి నుంచి మార్చి కాలానికి గానూ రూ.12,000 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆర్బీఐకి అప్పుల కేలండర్‌ కూడా పంపింది.

ప్రస్తుతం రాష్ట్రం అప్పుల కుప్ప అయింది. జీఎస్‌డీపీలో ఈ అప్పులు ఏకంగా 75 శాతంగా ఉన్నాయి. 2018లో కేంద్రం సవరించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు జీఎ్‌సడీపీలో 20 శాతం మించకూడదు. కానీ, జగన్ ప్రభుత్వ అప్పులు ఉండాల్సిన పరిమితి కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇక రాష్ట్రం ఏం బాగు పడుతుంది ?, ఇంకేం అభివృద్ధి చెందుతుంది ?, ఇక కొత్త కంపెనీలు ఏమి వస్తాయి ?, ఈ అప్పులకు తోడు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లు ఉన్నాయి. వాటిని ఇవ్వకుండా ఉండటంతో ఎందరో కాంట్రాక్టులు ఊరి పోసుకుంటున్నారు. వారి ఉసురు ఈ జగన్ రెడ్డికి తగలకుండా ఎందుకు ఉంటుంది. అసలు ఇన్ని అప్పుల అరాచకాల మధ్య కూడా జగన్ రెడ్డి ఇంకా కొత్త అప్పుల కోసం రాష్ట్ర సంపదను కూడా అమ్ముకుంటున్నాడు. దీనిబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ?, జగన్ రెడ్డి పాలన కేవలం అప్పుల వలయం మీద నడుస్తోంది.

వైసీపీ అభిమానుల్లారా.. ఈ అప్పులతో మనకేం పని అనుకోవడానికి లేదు. ఈ అప్పుల పాపాలకు ముఖ్య కారణం మీరే. జగన్ రెడ్డిని గెలిపించి.. ఆంధ్ర భవిష్యత్తు పీకను కోరికేసింది మీరే. తెలుగు తల్లి గుండె పోటుకు ముఖ్య కారణం మీరే. అసలు మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది. జగన్ రెడ్డి గెలిచాక, మీకేం వచ్చింది ?, జగన్ రెడ్డి అవినీతి పెరిగింది. ఈ రోజు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే.. జగన్ రెడ్డి ఇసుక మీకు ఫ్రీగా ఇస్తున్నాడా ?, లేదుగా. మీలో కొందరు జగన్ పార్టీ కోసం అప్పులు కూడా చేశారు. మరి కనీసం ఆ అప్పులకు వడ్డీ డబ్బులు అయినా జగన్ రెడ్డి ఇచ్చాడా ?. అసలు జగన్ రెడ్డి స్వభావం గురించి మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. సాక్షి పేపర్. జగన్ రెడ్డిని ప్రజల్లోకి మోసుకెళ్లిన పేపర్ అది. అలాంటి పేపర్ లో తక్కువ జీతాలకు పని చేసిన జర్నలిస్ట్ ల సోదరులకు జీతాలు పెంచాల్సి వస్తోందని.. తాను గెలిచిన వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తొలిగించాడు. ఇది చాలదా జగన్ రెడ్డి కుట్ర బుద్డి గురించి చెప్పడానికి !!.

Recent Articles English

Gallery

Recent Articles Telugu