HomeTelugu Big Storiesతొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..!

తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..!

‘కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం’.. “దాసరి నారాయణరావు” అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
 
చిన్న కధ నుండీ పెద్ద కధ వరకూ, చిన్న బడ్జెట్‌ నుండీ భారీ బడ్జెట్ వరకూ‌, కొత్త నటుల నుండీ అనుభవజ్ఞుల వరకూ, చిన్న స్టార్స్‌ నుండీ పెద్ద స్టార్స్‌ వరకూ అందరితో చిత్రాలను నిర్మించి, వాటిని వెండితెరపై Super Duper Hit చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
 
‘దర్శకుడు’ అంటే ఒకే రకం (రసం) కధా చిత్రాలకే పరిమితం కారాదు, అన్ని రకాల (నవరసాల) కధలను Deal చేయగల సత్తా ఉండాలన్న ధ్యేయంతో, విభిన్న కధలతో కూడిన చిత్రాలను వెండితెరకి అందించిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
 
‘దర్శకుడు’ అంటే కేవలం Lights, Camera, Action & Cut అనే పదాలకే పరిమితమైపోకుండా, ఆ వృత్తికి ఓ Self Respect, Pride & Command లను తెచ్చి, ‘దర్శకుడు’ అనే పేరుకి ఒక Special Recognition Create చేసి, ‘దర్శకుడే’ అసలుసిసలైన Hero అనే స్థాయికి తీసుకెళ్ళటమేకాక, ‘దర్శకుడు’ కూడా నటించగలడు అని నిరూపిస్తూ , పలు Blockbuster చిత్రాలను వెండితెరపై వెలిగించిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
 
కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం ఇత్యాది పనులతో పాటు, పరిశ్రమలోని ప్రతివ్యక్తి సమస్యను తన సొంత సమస్యగా భావిస్తూ, తనదైన శైలిలో దానిని పరిష్కరించగలిగే శక్తి (L E A D E R) గా ఎదిగి, అందరి చేత భక్తి, శ్రద్ధలతో ‘గురువు గారు’ అని పిలిపించుకున్న తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
 
‘దర్శకుడు’ అంటే కేవలం చిత్ర పరిశ్రమతోనే ఆగిపోనఖ్ఖర్లేదూ, జర్నలిజం, రాజకీయాల్లోకీ వెళ్ళొచ్చూ, ‘పత్రికాధినేత’ ‘కేంద్ర మంత్రి’ కూడా అయ్యి, ప్రజాసేవ చెయ్యొచ్చూ అని తెలియజెప్పిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
 
మీ దర్శకత్వంలో స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’ గారు నటించిన ‘మనుషులంతా ఒక్కటే’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ చిత్రాలు, అన్నగారి వీరాభిమానులమైన మా గుండెల్లో, మీరు జరిపించిన ‘దీపావళి’ పండుగలు. మీ దగ్గర Assistant గా పని చేయకపోయినా, నన్ను మీ శిష్యుడిగా, సొంత మనిషిగా ఆదరించారు. మా ‘బొమ్మరిల్లు వారి’ సంస్థ నిర్మించిన ప్రతి Cinema Function కూ, మీరు Chief Guest గా రావటమే కాక, మీ ఆశీస్సులు అందిస్తూ వచ్చారు..
 
151 చిత్రాలను దర్శకత్వం వహించే శక్తిసామర్ధ్యాల్ని మీకిచ్చిన ఆ దేవుడు, 100 ఏళ్ళ ఆయుష్షునివ్వకుండా 75 ఏళ్ళకే తన దగ్గరకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవటం వెనుక ఆయనకి ఎన్ని లెక్కలున్నా, ఇంతకు మించిన శక్తిసామర్ధ్యాలతో మిమ్మల్ని మళ్ళీ పుట్టించాలని మనస్పూర్తిగా ఆయన్నే ప్రార్ధిస్తూ..
 
మీ శిష్యుడు,
వై వి ఎస్ చౌదరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu