తెలుగులో అగ్రతారగా వెలుగొందుతోన్న సమయంలో బాలీవుడ్ కి వెళ్లిపోయింది గోవా బ్యూటీ
ఇలియానా. హిందీలో టాప్ పొజిషన్ కు వెళ్లిపోతానని ఆశ పడి పూర్తిగా టాలీవుడ్ ను పక్కన
పెట్టేసింది. అయితే అమ్మడుకి అక్కడ అవకాశాలు లేకుండాపోయాయి. రీసెంట్ గా నటించిన
‘రుస్తుం’ సినిమాతో ఇలియానాకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.. ఈ నేపధ్యంలో ఇల్లీ బేబీ
మాట్లాడుతూ.. ‘నాకు బాలీవుడ్ సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. అందుకే సౌత్ నుండి
ఇక్కడకి వచ్చేశాను. కానీ ఇక్కడ సరైన అవకాశాలు రావడం లేదు. వస్తే చేస్తాను.. లేకపోతే
లేదు.. అంతేకాని నేను ఎవరి ముందు చేతులు కట్టుకొని నిలబడి అవకాశాలు ఇవ్వమని
అడగను’ అంటూ తన కోపాన్ని చూపించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో ‘బాద్షా’ అనే సినిమాలో
ఇలియానా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నది కూడా ఈ ఒక్క ప్రాజెక్టే!!