2024 Tollywood flops:
2024 టాలీవుడ్ సినీ పరిశ్రమకు భారీ విజయాలతో పాటు కొన్ని నష్టాలను తీసుకువచ్చిన సంవత్సరం కూడా. ఈ ఏడాది చాలా మంది యువహీరోలు, టాప్ హీరోలు వరుస ఫ్లాపులతో తీవ్రంగా నిరాశ చెందారు. ముఖ్యంగా, విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో యాక్షన్ మోడ్‌లో కనిపించినా, ప్రేక్షకులకు నచ్చలేదు.
రవితేజ చేసిన ఈగిల్, మిస్టర్ బచ్చన్, గోపీచంద్ నటించిన భీమా, విశ్వం చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో విఫలమయ్యారు. శర్వానంద్ మనమేతోనూ విఫలమయ్యాడు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, మట్కా చిత్రాలతో నిరాశపరిచాడు.
View this post on Instagram
విశ్వక్ సేన్ ఈ ఏడాది గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో మూడు డిజాస్టర్లను అందుకున్నాడు. శ్రీ విష్ణు చేసిన ఓం భీమ్ భుజ్, స్వాగ్ సినిమాలు, సుహాస్ నటించిన ప్రసన్న వదనం, జనక అయితే గనక, గొర్రె పురాణం చిత్రాలు వరుసగా బోల్తాపడ్డాయి.
నారా రోహిత్ ప్రతినిధి 2, నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, రామ్ డబుల్ ఈస్మార్ట్, సుధీర్ బాబు హరోమ్ హరా, మా నాన్న సూపర్ హీరో చిత్రాలు పూర్తిగా విఫలమయ్యాయి.
View this post on Instagram
కార్తికేయ, ఆనంద్ దేవరకొండ, అల్లరి నరేష్, నవదీప్ వంటి చిన్న హీరోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్, అఖిల్, నాగ చైతన్య, మంచు విష్ణు వంటి వారి సినిమాలు ఈ ఏడాది అసలు విడుదల కూడా కాలేదు.
ఇక రాబోయే రోజుల్లో అయినా హీరోలు తమ కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తోంది.