Retaining Wall Vijayawada Controversy:
కృష్ణానది వరదలు వస్తే కృష్ణలంక ప్రాంతం మొత్తం మునిగిపోతూనే ఉంటుంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఇక్కడి ప్రజల రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం 2009 నుంచే ప్లాన్ చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.
మొదటి వాల్ రామలింగేశ్వరనగర్ నుంచి రాణిగారి తోట వరకు నిర్మించగా, రెండో వాల్ రాణిగారి తోట నుంచి కనకదుర్గ వారధి వరకు నిర్మించారు. మూడో వాల్ పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గ వారధి వరకు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మూడు వాల్ లు కలిపి మొత్తం 3.44 కిలోమీటర్లు ఉండగా, ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం 2.28 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేసింది. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చాలా క్లిష్టమైనది. ముఖ్యంగా కఠినమైన భాగాలను చంద్రబాబు హయాంలో పూర్తిచేయగా, 2019 వరదల సమయంలో ఈ వాల్ స్థానిక ప్రజలను రక్షించింది.
టీడీపీ ప్రభుత్వం వాల్ పూర్తిచేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీ ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లను కూల్చాల్సి రావడంతో ప్రజలను ప్రభోధించి టీడీపీ ప్రభుత్వానికి సహకరించకుండా చేసింది. ప్రజలకు ఇళ్లు, పరిహారం అందిస్తామన్నా సహకరించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వారిపై కోర్టులో కేసులు వేయించిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కారణంగా వాల్ పూర్తిగా పూర్తికాలేదు. తర్వాత జగన్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తిచేసింది.
అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే.. వైసీపీ సోషల్ మీడియా టీం మొత్తం క్రెడిట్ తమదే అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2019 ఆగస్టులో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వాల్‌పై నిలబడ్డ ఫోటోలు ఉన్నాయి. వాల్ నిర్మాణం పూర్తి చేయడానికి మూడు నెలలు పట్టిందని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. అయితే జగన్. నిజంగానే పని చేసినా కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అసలు నమ్మే అవకాశం లేదు కాబట్టి.. వాళ్ల పప్పులు ఉడకడం లేదు.