అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత వైఎస్ ఫ్యామిలీకి ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అతికినట్టు సరిపోతుంది. జగన్ గారి ‘ఒంటి గంట రామలింగం’ ఫిలాసఫీతో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం తలబొప్పి కట్టింది. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న చెల్లికి అండగా నిలబడాలని విజయమ్మ మొర పెట్టుకుంటే.. తన పార్టీలో ఆమెకున్న పదవిని కూడా పీకి పారేశాడు. విజయమ్మ కి ఆమె పుత్ర రత్నం ఇచ్చిన షాక్ చూసి జనం కూడా విస్తుపోక తప్పలేదు. తల్లి విజ్ఞప్తినే తుడిచేసిన వ్యక్తి.. ఇక ప్రతిపక్ష నేత విషయంలో ఎలా పద్ధతిగా ఉంటాడు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం చంద్రబాబు రోడ్ షోల వ్యవహారం.
ఒకరకంగా ఈ రోడ్ షో అనేది బాబుకి పాదయాత్ర లాంటిది. ఐతే, ప్రస్తుత పరిస్తితుల్లో అసలు ఈ రోడ్ షోలకి అనుమతులు లభిస్తాయా? లభించినా బాబు రోడ్ షోలు సజావుగా సాగుతాయా ? ఇలాంటి అనుమానాలు, ప్రశ్నలు అందరి మెదళ్లనూ తొలిచివేస్తున్నాయి. ఈ అనుమానాలను పక్కన పెడితే అసలు పాదయాత్ర పేరుతో గెలిచి, ఇప్పుడు ఆ పాదయాత్ర అంశాన్నే పక్కన పెట్టాలని జగన్ చూడటం కొత్తగా తమకే చిక్కులు తెచ్చి పెడతాయని జగన్ పార్టీలోని నాయకులే గుస గుసలాడుకోవడం కనిపిస్తోంది. ప్రజల వద్దకు చంద్రబాబును వెళ్లకుండా అడ్డుకోవడం అంటే.. ప్రజల్లో బాబు క్రేజ్ ను పెంచడమే అని కొందరు వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
సీఎం జగన్ ఎందుకు ఈ విపరీత పోకడలు పోతున్నాడో అర్ధం కావడంలేదని ఆయన పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవునూ, జగన్ తాజాగా తీసుకొచ్చిన రోడ్ షోల రద్దు జీవో అనేది జగన్ పైనే మరింత వ్యతిరేకత
పెంచే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2024లో జరగబోయే ఎన్నికలకు తెలుగుదేశం తరపున ప్రధాన ఫేస్ చంద్రబాబే. 72 సంవత్సరాల చంద్రబాబును ఇబ్బంది పెట్టడం అంటే.. ఆయన పై ప్రజల్లో సానుభూతి పెంచడమే అవుతుంది. అసలు జగన్ ఈ రోజు సీఎంగా ఉన్నాడు అంటే.. అందుకు ప్రధాన కారణం.. కేవలం ప్రజల్లో ఆయనకు ఉన్న సానుభూతే. ఇప్పుడు అదే సానుభూతి జగన్ నుంచి చంద్రబాబు మీదకు షిఫ్ట్ అవుతుంది. ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పుకున్నట్లు విజయమ్మ విషయంలో జగన్ తీసుకున్న కఠిన నిర్ణయం సమయంలోనే.. జగన్ తన పై ఉన్న సానుభూతిని పోగొట్టుకున్నాడు. సానుభూతి పోయింది అంటే.. జగన్ బలం పోయినట్టే.