AP Politics: ఏపీలో ఎన్నికలు పూర్తై చాలా రోజులు అయినా కూడా ఇంకా వేడి మాత్రం తగ్గలేదు. మరికొన్ని రోజులు జూన్4న ఫలితాలు రానున్నాయి. ఓట్లు కూడా రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గత శాసనసభ ఎన్నికలలో సుమారు లక్షన్నర ఓట్లు పోస్టల్ బ్యాలట్స్ ద్వారా నమోదు కాగా ఈసారి సుమారు 5 లక్షలకు పైగా నమోదయ్యాయి.
పోస్టల్ బ్యాలట్స్ ఓట్లలో ఈ పెరుగుదల చూసినప్పుడే వైసీపీలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే అవన్నీ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులవే కనుక. వారందరూ జగన్ ప్రభుత్వ బాధితులే . గత శాసనసభ ఎన్నికలలో సుమారు లక్షన్నర ఓట్లు పోస్టల్ బ్యాలట్స్ ద్వారా నమోదు కాగా ఈసారి సుమారు 5 లక్షలకు పైగా నమోదయ్యాయి.
పోస్టల్ బ్యాలట్స్ ఓట్లలో ఈ పెరుగుదల చూసినప్పుడే వైసీపీలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే అవన్నీ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులవే కనుక. వారందరూ జగన్ ప్రభుత్వ బాధితులే. వారిలో మెజారిటీ శాతం టీడీపీ కూటమికే వేసి ఉంటారని వేరే చెప్పక్కరలేదు. కనుక కౌంటింగ్ సమయంలో వాటిలో వీలైనన్ని ఎక్కువ ఏదో వంకతో పక్కన పెట్టించేందుకు వైసీపి తప్పకుండా ప్రయత్నించవచ్చు.
కానీ జగన్ ప్రభుత్వానికి ఈసీ ఈ విషయంలో మరో చిన్న షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, వాటిని పక్కన పెట్టకుండా లెక్కించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పోస్టల్ బ్యాలట్ ఓట్లలో రిటర్నింగ్ ఆఫీసర్ లేదా మరో అధికారి సంతకం పెట్టడం మరిచిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈసారి అలా జరిగినా ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయని ఈసీ చెప్పడం వైసీపికి మరో ఎదురుదెబ్బే అని భావించవచ్చు.
ఇక పోలింగ్ తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ సీనియర్ నేతలు, అలాగే పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేతలు, అభ్యర్ధులు ఫలితాల గురించి మాట్లాడలేదు. అందరూ 120 కంటే ఎక్కువ సీట్లు సాధించి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారే తప్ప అతిగా మాట్లాడటం లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్ధా వెంకన్న వంటి కొందరు టీడీపీ నేతలు మాత్రం వైసీపిని పోలిటికల్ ర్యాగింగ్ చేస్తూ వినోదిస్తున్నారు. టీడీపీ నేతల మౌనం కూడా వైసీపీ నేతలని మరింత భయపెడుతున్నట్లే ఉంది. అందుకే జగన్ ప్రమాణస్వీకారం కోసం విశాఖలో హోటల్స్ అన్నీ అప్పుడే బుకింగ్ అయిపోయాయని, రాష్ట్రం నలుమూలల నుంచి జూన్ 8,9 తేదీలలో విశాఖ వెళ్ళే బస్సులలో టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయని చెప్పుకుంటున్నారు.
కానీ వారు ఈ గొప్పలు చెప్పుకొంటున్నప్పుడైనా వారి మొహాలలో సంతోషం కనబడటం లేదు! జూన్ 9వ తేదీన జగన్ విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని మొన్న బొత్స సత్యనారాయణ చాలా గంభీరంగా చెప్పారు. ప్రమాణస్వీకారం గురించి మాట్లాడుతూనే ఈసీ, పోలీస్ అధికారులు అందరూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారని వాపోతున్నారు. టీడీపీ నేతలు ఇంత ప్రశాంతంగా ఉండటం, మరోవైపు ఓటమి.. దాని తర్వాత మొదలయ్యే కష్టాలు కళ్ళ ముందు కదలాడుతుండటంతో, వైసీసీ నేతలు పొంతన లేకుండా మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు.