ఏపీ దివంగత మాజీ సీఎం వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆయన తనయుడు ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా వస్తున్న చిత్రం యాత్ర-2. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం ఇలా ప్రతిది 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రంలో చంద్రబాబు, సోనియాగాంధీ తదితర ప్రముఖ నేతలను కూడా చూపించారు. చంద్రబాబు పాత్రను బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రను సుజానే బెర్నెర్ట్ పోషించారు
ఈ బయోపిక్‌ని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల విడుదల చేయనున్నారు.