దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు.
జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.
A tribute to the greatest journey history has ever witnessed. #Yatra in cinemas from 8th Feb.
A film by @MahiVRaghav.@mammukka @VijayChilla @devireddyshashi #ShivaMeka @K_RiverRecords @MangoMusicLabel #YatraOnFeb8th pic.twitter.com/tn4iGz82S2— #YatraOnFeb8th (@70mmEntertains) December 14, 2018