వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత బయోపిక్ ‘యాత్ర’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 8 వ తేదీన విడుదల కాబోతున్నది. యూఎస్ లో ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ సేల్ మొదలైంది. యూఎస్ లోని సీటెల్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ను ఆన్లైన్ లో సేల్ చేశారు. ఫస్ట్ టికెట్ ధర ఏకంగా రూ.4.37 లక్షల రూపాయలు పలికింది. సీటెల్ కు చెందిన ఎన్ఆర్ఐ మునీశ్వర్ రెడ్డి ఈ టికెట్ ను దక్కించుకున్నాడు.
మమ్మూట్టి ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ బయోపిక్ నిడివి కేవలం 126 నిమిషాలు మాత్రమే ఉండటంతో ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్, సాంగ్స్ సూపర్బ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.