టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో సమంతకి మంచి క్రేజ్ ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో.. ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. సైన్స్ ఫిక్షన్ తో కూడిన థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5:49 నిమిషాలకు టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. భయం .. బాధతో కూడిన ఎక్స్ ప్రెషన్ తో సమంత ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా అందరిలో ఆసక్తి కలిగిస్తున్నారు మేకర్స్.
శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి శంకర్ – హరి నారాయణ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, ఉన్నిముకుందన్, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Unveiling the other side of #Yashoda in 2 Days 🔥
Make way for #YashodaTeaserOnSep9th @ 5:49PM💥#YashodaTheMovie @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/xVp7dDlOn1
— Sridevi Movies (@SrideviMovieOff) September 7, 2022