HomeTelugu Trending'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్‌

‘యశోద’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Yashoda movie release date
స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న తాజా లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ఇది. హరిశంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీను ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలుపుతూ.. అధికారిక పోస్టర్ ను వదిలారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్‌డేట్స్ కి మంచి స్పందన వచ్చింది. ఉన్ని ముకుందన్, మురళీశర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘ఖుషి’ సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu