HomeTelugu Trending'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2': అమ్మ పాట విడుదల

‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’: అమ్మ పాట విడుదల

Yadagara Yadagara Lyrical f
‘కేజీఎఫ్‌’ మూవీ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు . ఈ ఒక్క సినిమా.. కన్నడ హీరో యశ్‌ని పాన్‌ ఇండియా స్టార్‌గా మార్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేశాయి.

తాజాగా ఈ సినిమా నుంచి అమ్మ పాట (వాయిస్‌ ఆఫ్‌ ఎవ్రీ మదర్‌)ను విడుదల చేశారు. ‘ఎదగరా.. ఎదగరా’ అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చిన ఈ పాటకి తెలుగులో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సుచేత బస్రూర్ అద్భుతంగా ఆలపించారు. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కొడుకుతో ఏఆర్‌ రెహమాన్ ఫొటో.. వైరల్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu