నిన్న మొన్నటి వరకు ఏపీ ఎన్నికల ప్రచారంలో.. పాల్గొంటూ అలసిపోయారు ముఖ్యమంత్రి జగన్. ఇక ఎలక్షన్స్ అవ్వడంతో ఈ మధ్యనే జగన్.. విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
కాగా ఎత్తకెలకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో పోలింగ్ పూర్తైన వెంటనే వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్ళడానికి వెనక పలు కారణాలు ఉన్నాయి అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే సుమారుగా 15 రోజులపాటు జగన్ విదేశాల్లో పర్యటించారు. ఇక త్వరలోనే ఎలక్షన్ రిజల్ట్స్.. అనౌన్స్ అవుతూ ఉండడంతో తిరిగి ఇండియాకి చేరుకున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో జగన్ స్వదేశానికి ఈరోజ ఉదయాన్నే చేరుకున్నారు.
కాగా ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే లండన్ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన రెగ్యులర్ లుక్ కు భిన్నంగా జగన్ ఈ ఫోటోలలో కనిపించడం విశేషం. ముఖ్యమంత్రిగా నిత్యం తెల్ల షర్ట్, సాధారణ చెప్పులతో కనిపించే జగన్.. దానికి భిన్నంగా జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకుని చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
ఇక కొంతమంది మాత్రం.. మొత్తానికి ఐదు సంవత్సరాలు ప్రజల డబ్బులు తినేసి.. విదేశాలకు వెళ్లి ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో జగన్ మోహన్ రెడ్డి భేటీకానున్నారని సమాచారం. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పార్టీ కీలక నేతలతో చర్చించనున్నారు.