తెలుగు, తమిళ భాషల్లో రానున్న తొలి కంప్యూటర్ స్ర్కీన్ చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు ఎక్కడ ఎందుకు). ‘118’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న కె.వి. గుహన్ తెరకెక్కిస్తోన్న రెండో చిత్రమిది. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తున్నారు. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మాత. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రానున్న ఈ సినిమా థీమ్ సాంగ్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. కేవలం నేపథ్య సంగీతంతోనే ఈ వీడియో రూపొందింది. సైమన్ కె.కింగ్ అందించిన సంగీతం ఉత్కంఠగా సాగింది. నటీనటుల్ని స్కెచ్ రూపంలో వాళ్లని చూపించారు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.