టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. చిన్న సినిమాగా రిలీజై సంచలనం విజయం సాధించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లింది. ఫ్యామిలీ ఆడియోన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. రైటర్ ఇంతపెద్ద విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళల కోసం రేపు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని 38 థియేటర్‌లలో నాలుగు షోలలో మహిళలు ఉచితంగా సినిమాను చూడొచ్చు. అయితే ఆ థియేటర్‌ల లిస్ట్ ఇంకా బయటకు రాలేదు. చిత్రబృందం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు రైటర్ సినిమా దాదాపు రూ.6 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాలను ఎంతైనా ఆదరిస్తారని మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. ఇక్కడే అనుకుంటే ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా విజయఢంకా మోగిస్తుంది. ఓవర్సీస్‌లో దాదాపు 2లక్షల డాలర్లకు పైగా కలెక్షన్‌లు వచ్చాయి.