HomeTelugu Newsదేశం గర్వపడేలా చేసింది: మోడీ

దేశం గర్వపడేలా చేసింది: మోడీ

1 26ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీసింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్‌ గోపీచంద్‌లను మోడీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్‌ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోడీ ట్వీట్‌ చేశారు.

భారత స్టార్‌ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఐదో సీడ్‌ సింధు 21-7,21-7తో మూడో సీడ్‌ నొజొమి ఒకుహర(జపాన్‌)ను చిత్తు చేసింది. కేవలం కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి.. విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu