లాక్డౌన్ ఎఫెక్ట్‌తో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి భారీగా రూపొందిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విడుదల తేదీలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే షూటింగ్ షెడ్యూల్లో మార్పులు జరిగినప్పటికీ.. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది జనవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాక్డౌన్ టైమ్‌లోనే వీలైనంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అంతా ఇంట్లోనే ఉంటూ సినిమా పనులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే హీరోలకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటి నుంచే డబ్బింగ్ పనుల్ని మొదలుపెట్టారట. సాధారణంగా డబ్బింగ్ చెప్పడానికి సౌండ్ ప్రూఫ్ రూమ్‌లు, క్వాలిటీ ఉన్న సౌండ్ రికార్డింగ్ మైక్ కావాలి. ఇందు కోసం రాజమౌళి.. తారక్, చరణ్ ఇంటికి రెండు క్వాలిటీ మైక్‌లు పంపినట్లు సమాచారం. వారి వారి ఇంటిలో సౌండ్ ఫ్రూఫ్ గోడలు ఉండే మినీ థియేటర్లో డబ్బింగ్ చెబుతున్నట్లు తెలిసింది. మరి ఈ సమాచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించి దాదాపు చిత్రీకరణ పూర్తయింది. హీరోయిన్ అలియా భట్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. నటి ఒలీవియా మోరిస్ ఇప్పటికే షూటింగ్లో పాల్గొన్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు.