ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజు జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్, చిరంజీవి అనే హ్యాష్‌ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆయన నిండు నూరేళ్లు చిత్ర పరిశ్రమను ఇలాగే రఫ్ఫాడించేయాలంటూ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
రామ్‌చరణ్: మీరు మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఓ మెంటార్‌గా నాతో పాటు లక్షలాది మందిని గైడ్ చేశారు. వారంతా మిమ్మల్ని మెగాస్టార్ అంటారు. నేను మిమ్మల్ని అప్పా అని పిలుస్తాను. హ్యాపీ బర్త్‌డే అప్పా. లవ్యూ.
రాధిక: మీరు మరింత సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు.
సుధీర్‌బాబు: ఇటీవల ఆయన దిగిన ఫొటోషూట్ చూశాను. అసలు వయసైనట్లు ఏమాత్రం కనిపించడంలేదు. హ్యాపీ బర్త్‌డే లెజెండ్.
దేవిశ్రీ ప్రసాద్: మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
గోపీచంద్ మలినేని: మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా కోసం ఆయన కష్టపడేతత్వం, డెడికేషన్ ఎందరికో స్ఫూర్తిదాయకం. ‘సైరా’లో ఆయన స్టైల్‌ను చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.
తమన్: మన అభిమాన హీరో పట్ల మనం చూపే ప్రేమలో నిజాయతీ ఉంటే.. ప్రతిఫలం మరోలా ఉంటుంది. ఆయనే నా ఫస్ట్ లవ్.
సురేందర్ రెడ్డి: ఎవర్గ్రీన్ స్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు.
మంచు మనోజ్: మీ చెయ్యి ఇంకా రఫ్‌గా ఉంది. ‘సైరా’తో మళ్లీ రఫ్ ఆడించేయండి. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్.
ప్రణీత: మన మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలి.
ప్రదీప్ మాచిరాజు: మీ సినీ జర్నీ మాలాంటి వారెందరికో స్ఫూర్తిదాయకం. పుట్టినరోజు శుభాకాంక్షలు సర్.
అవసరాల శ్రీనివాస్: హ్యాపీ బర్త్‌డే సర్. మాలో ఇలా స్ఫూర్తినింపుతూనే ఉండండి.
శ్రీనివాస్‌రెడ్డి: ప్రతిభకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎందరికో మార్గదర్శి మన మెగాస్టార్.
వెంకీ కుడుముల: నా జీవితంలో ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. మీ పక్కన నిలబడే అవకాశం వచ్చినందుకు నేనెంతో అదృష్టవంతుడిని.
శ్రీనువైట్ల: హ్యాపీబర్త్‌డే మెగాస్టార్. ఆయన నిబద్ధత ఎందరికో స్ఫూర్తిదాయకం. సైరా సినిమా కోసం ఎదురుచూస్తుంటాను.
హంసానందిని: ఆయన్ని తెరపై చూసిన ప్రతీసారి ఎగ్జైట్ అవుతుంటా. హ్యాపీ బర్త్‌డే చిరు.