HomeTelugu Big Storiesరివ్యూ: విన్నర్

రివ్యూ: విన్నర్

నటీనటులు: సాయి ధరం తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సురేష్ బాబు, అలీ, పృధ్వీ
తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
సాయి ధరం తేజ్ హీరోగా కమర్షియల్ దర్శకుడు గోపిచంద్ మలినేని రూపొందించిన చిత్రం ‘విన్నర్’. శివరాత్రి సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
మహేందర్ రెడ్డి(జగపతిబాబు)కి తన కొడుకు సిద్ధార్థ్ రెడ్డి(సాయి ధరం తేజ్) అంటే ప్రాణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా బయటకు వచ్చేసిన మహేందర్, భార్య చనిపోవడంతో కొడుకే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటాడు. బేసికల్లీ మహేందర్ మంచి హార్స్ జాకీ తను ఇంటి నుండి వెళ్లిపోవడంతో తన తండ్రికి బిజినెస్ పరంగా నష్టాల్ని ఎదుర్కొంటాడు. దీంతో ప్రేమ నటించి తనకొడుకు, మనవాడ్నిఇంటికి పిలిపిస్తాడు. అప్పటినుండి మహేందర్ ను తన బిడ్డ సిద్ధార్థ్ నుండి వేరు చేయాలనుకుంటాడు.
అనుకున్నట్లుగానే సిద్ధార్థ్ ఇంటి నుండి పారిపోయేలా చేస్తాడు. సిద్ధార్థ్ కు తండ్రి మీద ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారుతుంది. రేసులన్నా, నాన్న అన్నా సిద్ధార్థ్ కు చాలా కోపం. పెరిగి పెద్దయిన సిద్ధార్థ్ ఓ న్యూస్ ఏజెన్సీలో పని చేస్తుంటాడు. ఓ పార్టీలో సితార(రకుల్ ప్రీత్ సింగ్)ను చూసి ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. సితారకు సిద్ధార్థ్ అంటే నచ్చదు. ఇంట్లో సితారకు పెళ్లి చేస్తుండడంతో ఆ పెళ్లి ఇష్టంలేని సితార, సిద్ధార్థ్ ను ప్రేమిస్తున్నట్లుగా హార్స్ రేసింగ్ లో తను టాపర్ అని చెప్పి ఇరికిస్తుంది.
ఛాలెంజ్ ప్రకారం సిద్ధార్థ్ పెళ్ళికొడుకు ఆది(అనూప్ సింగ్)తో హార్స్ రేసింగ్ లో గెలవాలి. ఆది తన పేరు సిద్ధార్థ్ రెడ్డిగా మార్చుకొని మహేందర్ రెడ్డి ఇంట్లో ఉంటుంటాడు. దానికి అసలు కారణం ఏంటి..? అసలైన సిద్ధార్థ్ కు ఈ విషయం తెలుస్తుందా..? మహేందర్ కు తన మీద ఎంత ప్రేమ ఉందో.. సిద్ధార్థ్ తెలుసుకుంటాడా..? సిద్ధార్థ్ తనకు ఇష్టంలేని హార్స్ రేస్ ను ఆడతాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
రెగ్యులర్ కమర్షియల్ చూసే రోజులు మెల్లమెల్లగా టాలీవుడ్ లో తగ్గిపోతున్నాయి. కానీ ఇంకా అదే ఫార్ములాను నమ్ముకుంటూ సినిమాలు తీస్తూ నష్టపోతున్నారు. విన్నర్ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. నాలుగైదు ఫైట్స్, ఆరు పాటలు, విసుగు పుట్టించే కామెడీ సన్నివేశాలు ఇదే ఫార్ములతో సినిమా చేసేశారు. తండ్రి సెంటిమెంట్, హార్స్ రేసులంటే కథలో కొత్తదనం ఉంటుందని ఆస పడే ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశ పరచడం ఖాయం.

దానికి తగ్గట్లుగానే ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కూడా ఉంది. సాయి ధరం తేజ్ పాటల్లో, యాక్షన్ సీన్స్ లో బాగానే నటించినప్పటికీ ఎమోషన్స్ ను పండించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. రకుల్ కేవలం గ్లాంర్ షోకి పరిమితమయింది. జగపతి బాబు నటన రొటీన్ గానే ఉంది. అనూప్ సింగ్ విలనిజాన్ని పండించడానికి అతడి క్యారెక్టరైజేషన్ అంత బలంగా లేదు. కథ, కథనంలో కొత్తదనం లేకపోతే సినిమా ఎంత గ్రాండ్ గా ఉన్నా ప్రేక్షకులకు నచ్చదు.

విజువల్ గా కూడా సినిమా అంతంతమాత్రంగానే ఉంది. ఛోటా స్టాండర్డ్స్ లో సినిమా లేదు. తమన్ రెగ్యులర్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ల్యాగ్, డైరెక్టర్ గారి టేకింగ్, మేకింగ్ మొత్తం అన్నీ కలిపి తేజుకి తిక్క సినిమా తరువాత మరో ఫ్లాప్ సినిమాను తెచ్చిపెట్టాయి. ఇకనైనా తేజు ఈ కమర్షియల్ పదాన్ని పక్కన పెట్టేసి కథల మీద దృష్టి పెడితే మంచిది. 

రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu