ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శతమానం భవతి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చేసిన అన్నీ సినిమాల్లో తన డ్రెసింగ్ స్టైల్‌తో ఈ సినిమాలో పక్కింటి అమ్మాయిలా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో వరుస హిట్‌తో దూసుకుపోయింది. ఆతరువాత కొంచెం డౌన్ అయింది. రంగస్థలం లాంటి కొన్ని హిట్ సినిమాలు చేజేతులా వదిలేసుకోవడంతో ఈ అమ్మడు కెరీర్ అప్పుడే గాడి తప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు డజన్ సినిమాలు చేసింది కానీ.. ఒక్క హిట్ కూడా రాలేదు.
మధ్యలో కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా తెలియదు. ఈ క్రమంలో గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. రౌడీ బాయ్స్‌లో అనుపమ చేసిన లిప్‌లాక్‌లను చేసింది అయితే అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు రొమాన్స్ మరియు బోల్డ్ డైలాగుల డోస్ రెట్టింపు చేస్తూ, అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లో అందరికి షాక్ ఇచ్చింది.
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. మార్చి 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈక్రమంలో ఈమూవీ ట్రైలర్ విడుదలైంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌లో లాంగ్ లిప్‌కిస్‌లతో, ఎక్స్‌పోజింగ్, డైలాగ్స్‌తో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. దీంతో ఈ సినిమా అనుపమ మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతుందని అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా అనుపుమ కెరీర్ ఎంతవరకూ ప్లస్ అవుతుందో.