స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సుకుమార్ ఎర్రచందనం స్మగర్‌గా కనిపించనున్నాడు. రష్మక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత ‘కేజీయఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ ప్రస్తుతం ‘కె.జి.యఫ్2’తో పాటు ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివరికి ఈ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ వెంటనే జనవరిలో బన్నీతో సినిమాని ప్రశాంత్ పట్టాలెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఆ మధ్య ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్‌ని కలిసిన సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ – కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ, అది తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక ‘వకీల్‌సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ చేస్తున్నట్లు గతేడాదిలో ప్రకటించారు. కానీ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇటీవల ఈ సినిమాని ప్రారంభించనున్నట్లు దిల్‌రాజు మీడియా ముందే ప్రకటించారు.