Game Changer: పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఈ మూవీ చాలా ప్రతిష్టత్మకంగా తెరకెక్కుతుంది. సినిమా ప్రారంభమై నాలుగో సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకూ ఈ సినిమా కేవలం 70 శాతం వరకూ మాత్రమే టాకీ పార్టును పూర్తి చేసేశారు.
ఈ ఏడాది చివరిలో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చేశాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ది ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, ఇందులో రామ్ చరణ్ తండ్రి పాత్రను కూడా చేస్తున్నాడని, అది సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘గేమ్ చేంజర్’ మూవీలో తండ్రి పాత్రను పోషించే రామ్ చరణ్ అభ్యుదయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాడట. ఆ సమయంలో అతడు సైకిల్ తొక్కుకుంటూ అసెంబ్లీకి వెళ్తాడని, ఆ సన్నివేశాలు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును గుర్తు చేసేలా ఉంటాయని అంటున్నారు. ఇదే నిజం అయితే ఈ చిత్రంలో ఈ ఎపిసోడ్ సంచలనం అవుతుందని అంటున్నారు.
కాగా ఈ ప్లాష్ బ్యాక్ పాత్రలో రామ్ చరణ్‌కి నత్తి కూడా ఉంటుంద. అయితే ఆ నత్తి కోపం వచ్చినప్పుడు మరింతగా పెరుగుతుందిట. ఈ క్రమంలో హీరో సైలెంట్ గా ఉంటాడని ఎక్కువ మాట్లాడరని చెప్తున్నారు. రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ చేంజర్’ మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.