టాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇటీవలే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు తరలి వచ్చారు. మరి వరుణ్ తో వివాహం అనంతరం లావణ్య యాధావిధిగా సినిమాలు కొనసాగిస్తుందా? లేక పెళ్లి తర్వాత కుటుంబ జీవితాని కే అంకితమవుతందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లావణ్య లైన ప్ లో సినిమాలు పెద్దగా లేవు. తమిళ్ లో ‘తానల్’ అనే సినిమా చేస్తుంది.
మరోవైపు పెళ్లికి ముందే మెగా ఫ్యామిలీకి లావణ్య ఒక కండిషన్ పెట్టిందనే వార్త వైరల్ అవుతోంది. ఆ కండిషన్ కు వరుణ్ తేజ్ ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి లావణ్య ఒప్పుకుందట. లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లైన తర్వాత కూడా తనకు స్టేజ్ పైన భరతనాట్యం చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదనే కండిషన్ ఆమె పెట్టిందట. పెళ్లి తర్వాత నటనకైతే దూరంగా ఉంటాను కానీ… ప్రొడక్షన్ వైపు మాత్రం వెళ్తానని చెప్పిందట. నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని కండిషన్ పెట్టిందట. దీనికి వరుణ్ తేజ్ తో పాటు, మెగా ఫ్యామిలీ ఒప్పుకుందని చెపుతున్నారు. కాగా వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనున్నట్లు తెలుస్తుంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు