అపార అనుభవం గల నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అవసరం. ప్రస్తుత ఆంధ్రా అనుభవం లేని ఒక్క మూర్ఖుడి చేతుల్లో విలవిలలాడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అభద్రతా భావంతో ఎక్కడికీ తిరగలేని పరిస్థితి తెచ్చుకున్నాడు. దాంతో పాటు ఖజానా ఖాళీ చేసి.. తన ఉచిత పథకాలతో నెలనెలా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని ఆంధ్రాకి తెచ్చాడు. అసలు జగన్ రెడ్డి గెలిచిన నిమిషం నుండి.. ప్రతిపక్షాల నిర్మూలనమే మెయిన్ అజెండా గా పనిచేస్తున్నాడు. అందులో భాగంగా అసెంబ్లీ లో తెలుగు దేశాన్ని లేకుండా చేయడానికి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు.
అయితే అన్యాయం ఎంతో కాలము నడవదు. కిరాయి మనుషుల తో దొంగ ఓట్లతో బూత్ రిగ్గింగులతో తెచ్చుకున్న అధికారం కూడా ఎక్కువ కాలం నిలవదు. అమరావతిలో రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి అనే నెపంతో నేడు ఎక్కడా రాజధాని లేకుండా చేశాడు. రాజధాని నిర్మాణం ఒక్క సంవత్సరం లో అయ్యేది కాదు. దాని ఖర్చు కేంద్రం ఇస్తానని చెప్పినప్పుడు ఇక బాధ ఏమిటి ?. జగన్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే… ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట. జగన్ రెడ్డి వాలకం కూడా అచ్చం ఇలాగే ఉంది.
ఇంతవరకు ఒక రాజధాని కే దిక్కులేదు, పైగా ప్రకటించిన రాజధాన్ని కూడా పాడు చేశాడు. ఇలాంటి జగన్ రెడ్డితో మూడు రాజధానులు జరిగే పనేనా ?, నేడు నిజంగా ఆంధ్రప్రదేశ్ ను చూస్తుంటే బాధ కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సమయంలో ఆంధ్ర ప్రజలంతా నిరాశకు లోనయ్యారు. 60 ఏళ్లు హైదరాబాద్ లో పెట్టిన పెట్టుబడులు ఇక వెనక్కి రావు, ఆంధ్ర రాష్ట్రంలోని భవిష్యత్ తరాలను రానున్న ఇబ్బందుల నుంచి ఎలా గట్టెక్కించాలి ? అందరిలో ఇదే ఆవేదన. అలాంటి సమయంలో ప్రజలందర్నీ పాజిటివిటీ వైపు మరల్చడానికి చంద్రబాబు చాలా కష్టపడ్డాడు.
కానీ, ఒక్క జగన్ రెడ్డి కారణంగా మళ్లీ ఆంధ్రాకి బాధే మిగిలింది. ఆదాయం, అప్పులు, వనరులు ఇలా ప్రతిదాంట్లోనూ ఏపీకి జగన్ రెడ్డి అన్యాయమే చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తే పార్లమెంటు, రాజ్యాంగంపై నమ్మకం పోతుంది. కేవలం తన రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ రెడ్డిని చూస్తుంటే.. రక్తం మరుగుతుంది. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఏ పథకం చూసినా అన్నీ చిల్లులే. ఎవడైనా విమర్శిస్తే ఈ అవక తవకలు మాటున తలలు పిండేస్తాం అంటూ డైరెక్ట్ గా పోలీసులు చేతే వార్నింగ్ లు ఇప్పిస్తున్నాడు. ఇదీ మన ఆంధ్ర దయనీయ పరిస్థితి.. ప్చ్.