రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న Double iSmart సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈమధ్య విడుదలైన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాకి సీక్వెల్ కాబట్టి ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ప్రమోషన్లు మొదలైనప్పటి నుంచి బజ్ కూడా పెరుగుతూనే వచ్చింది.
కానీ గత కొద్దిరోజులుగా ఈ సినిమా మీద ఎన్నో వివాదాలు నడుస్తూ ఉన్నాయి. లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన గొడవలు అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని పూరి జగన్నాథ్ తేల్చుకుంటారో లేదో పక్కన పెట్టేస్తే.. అవే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ శంకర్ విడుదలకి ఆటంకాలుగా మారుతున్నాయి.
ఒకవైపు చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్లు బాగానే చేస్తోంది కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. పేరుకి ఆగస్టు 15న సినిమా విడుదలవుతుంది అని ప్రకటించారు కానీ అది జరిగే పనైనా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సినిమా వాయిదా పడే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమా విడుదల గురించి ప్రేక్షకులు క్లారిటీ కోరుకుంటున్నారు. కానీ మూవీ యూనిట్ మాత్రం అది తప్ప అన్నీ చేస్తున్నారు. ప్రమోషన్స్ వల్ల సినిమా మీద హైప్ పెరుగుతుంది కానీ అసలు సినిమా వాయిదా పడుతుంది అనుకున్నప్పుడు ప్రమోషన్లు చేసిన వేస్టే కదా అని ఫ్యాన్స్ అంటున్నారు.
కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటించింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.