వడ్డీ లేని రుణాలపై చర్చ సందర్భంగా గురువారం సీఎం చాలా ఆవేశంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కానీ, తాము ఇష్టానుసారంగా కాకుండా దస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. సున్నా వడ్డీకి రుణాలపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దస్త్రాల్లో ఉన్న సమాచారాన్ని సభలో చదివి వినిపించారు. వడ్డీలేని రుణాలు చెల్లించామని ధ్రువీకరిస్తూ అధికారులు జారీ చేసిన లేఖలను సభలో చూపించారు. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న వడ్డీలను కూడా చెల్లించామని గుర్తు చేశారు’. నిన్న ముఖ్యమంత్రి నన్ను రాజీనామా చేయమని చెప్పారు. ఇప్పుడు నిజాలు చెప్పాం కదా.. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా?లేదా ప్రజలకు క్షమాపణ చెబుతారా?అని ప్రశ్నించారు.